INDIAN MYTHOLOGY
INDIAN MYTHOLOGY, Panchatantram Stories, Indian Sages.
Tuesday 5 March 2013
Friday 1 March 2013
పెద్దపులి- బాటసారి
రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ
చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న
కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం
వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర
జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు.
శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని
కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది.
భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు
ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ
అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు
చేతులు భయంతో వణికాయి. ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా...
ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని
భగవంతుడిని ప్రార్దించాను... దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే
నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న
కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం. చెట్ల
ఆకుల్లోంచి పడుతున్న సుర్యుడి వెలుగుకి ధగధగా మెరుస్తోంది. దాన్నిచూడగానే శివశర్మ
మనసులో ఆశ పుట్టింది.
Thursday 28 February 2013
దురాశ దుఖా:నికి చేటు.
వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు
ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహారపదార్థాలను
సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో
దొరకనిదేముంది? ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం ఇలా ఎన్నో
లభిస్తాయి. కాని, ఈ శాఖాహారం కంటే కుందేలు, జింక, అడవి పంది వంటి జంతువుల
మాంసాహారమే ఈ వేటగాళ్ళు ఇష్టపడతారు. భైరవుడు ఒకనాడు ఒక బలసిన జింకను వేటాడి
చంపాడు. ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చుననుకుంటూ, దానిని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే
ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది కనిపించింది.
భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకున్నాడు. పదునైన బాణంతో ఆ అడవి
పంది రొమ్మును గాయపరిచాడు. అడవి పందులకు కోపం మొండితనం ఎక్కువ. వేటగాడి బాణం
వెనుదిరిగి వచ్చిందా అన్నట్లు, అది అతి వేగంగా వచ్చి, భైరవుని పొట్టను కోరలతో చీల్చి చంపింది. తర్వాత, అదీ చచ్చింది. వీరి తొక్కిసలాటలో ఆటుగా వచ్చిన పాము
కూడా, ప్రాణాలు విడిచింది.
ముంగిస - పిల్లాడు
ఎంతవారయినా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు.
చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధ పడతుంటారు. తొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి
హేతువు. శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు
చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన
చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న
పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది
లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది
పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట
చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ
నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే
సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.
మూడు చేపలు
మంచిని ఎవరు
చెప్పినా వినాలి. అలాకాక అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఆ మంచిమాటలను పెడచెవిన పెడితే అందుకు తగిన ప్రతిఫలం
అనుభవించక తప్పదు. ఇతరులందరూ అబద్దాలు చెప్పేవాళ్ళు అనుకుంటే అంతకు మించిన పొరపాటు
మరొకటి లేదు. అలాంటి పొరపాటులు ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెస్తాయి అది ఎలాగో
ఈ మూడు చేపల కధ ద్వారా తెలుసుకుందాం.
Wednesday 27 February 2013
The Brahmin and The Cobra
The Brahmin and The Cobra
Haridatta was a Brahmin who
was very poor. He was a farmer but the piece of land he cultivated gave him
very little to survive. One day, unable to stand the heat of the summer sun, he
went to a big Tree in his land to rest for a while. Before he could spread
himself on the ground he saw in the nearby anthill a huge cobra swaying with
his hood open. He thought, “This cobra must really be the Goddess of this land.
I have never worshiped her, which is why I am not able to get anything from
the land. From today, I will worship her.” At once he went back to his village
and returned with a glass full of Milk. He
poured it in a bowl and turning to the anthill said, “O ruler of the land, I
did not know you were living in this anthill. That is why I have not paid my
tribute to you. Please excuse me and accept this humble offering.” He then
placed the bowl of milk at the anthill and left the place.
Next day when the Brahmin
came to his land before the Sun was up; he saw a gold coin in the bowl he had
left at the anthill. Henceforth, he came alone every dawn, collected the coin,
offered the milk in the bowl and left. One day the Brahmin, leaving for another
village on business, asked his son to go to the anthill and offer milk. When
the son went the next day, he found a gold coin in the bowl. He collected the
coin and thought, “This anthill must be full of gold. If I kill the cobra, I
can collect all the gold in one go instead of coming here every day.” He then struck
the cobra with a big stick. But the cobra deftly dodged the blow but stung the
son to death with his poisonous fangs. Returning to his village the next day,
Haridatta heard the story of his son’s death and at once realised that greed
was behind it.
The Brahmin went to the
anthill the day after his son’s cremation and offered milk to the cobra.
Without coming out of his hole, the cobra told Haridatta, “You have come here
for gold forgetting that you had lost a son and that you were in mourning. The reason
is greed, pure greed. From today, there is no meaning in our relationship.
Blinded by his youth, your son has struck me and I bit him back. How can I
forget that blow? How can you suffer the grief of your son’s death? Finally, I
am giving you this diamond, don’t come back again.”
MORAL: Excess of greed is harmful.
Subscribe to:
Posts (Atom)